బీజేపీ శక్తులను ఓడించండి: ఐఎఫ్ టీయూ

– 138వ మేడే కార్యక్రమాలు జరపండి కార్మిక వర్గానికి పిలుపు.ఐఎఫ్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎల్ పద్మ
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బీజేపీ అసియుక్త శక్తులను ఓడించి 138 వ మేడే కార్యక్రమాలు జరుపుకోవాలని ఐఎఫ్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ ఎల్ పద్మ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఐఎఫ్ టీయూ జిల్లా కమిటీ సమావేశం విక్రమ్ భవన్లో ఎస్ డి సయ్యద్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ పాల్గొని మాట్లాడుతూ.. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాల్లో 29 చట్టాల్లో నాలుగు లేబర్ కోడ్స్ గా విభజించి, 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేశారు. ఈ 4 లేబర్ కోడులను కార్మిక సమ్మెపై అనేక ఆంక్షలు, 8 గంటలకన్నా అనేక పని గంటలు పని చేయించుకోవచ్చని నిబంధన, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఈ నాలుగు లేబర్ కోడులలో పొందుపరిచారు, ఎనిమిది గంటల పని స్థానంలో 12 గంటల పని చేయొచ్చని నిబంధన తీసుకువచ్చి అడ్డు అదుపు లేకుండా కార్మిక వర్గాన్ని దోచుకోవచ్చనే అవకాశం, కార్మికులు సెలవులు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒకపక్క రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి భూమి నుండి రైతును వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. భవిష్యత్తులో రైతుని మ్యూజియంలో చూసే పరిస్థితి రాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రైతు వ్యతిరేక శక్తుల్ని ఓడించాలని వారు కోరారు. 138 వ మేడే కార్మిక వర్గానికి చరిత్ర కలిగిన నేల ఆ నెలలో పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి, కార్మిక వర్గం హక్కులు, పనిగంటలను దృష్టిలో ఉంచుకొని కార్మిక ఉద్యమాలకు సిద్ధం కావాలన కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రమేష్ కోశాధికారి వాజిద్, సభ్యులు చిత్తలూరు లింగయ్య, ఎస్కే సయ్యద్, కరుణాకర్ ,మంగ, పాల్గొన్నారు.
Spread the love