ప్రభుత్వ వ్యవహారాల సలహాదారునిగా నియామకం పట్ల హర్ష వ్యక్తం

– బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వనికి వ్యవహారాల సలహాదారునిగా నియమకమైన మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే  మేం నరేందర్ రెడ్డి కి హర్ష వ్యక్తం ప్రకటించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయనను హైదరాబాదులో కలుసుకొని బొకే ఇచ్చి శాలువ తో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాద్ ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కి మరియు ప్రభుత్వ వ్యవహారాల సలహాదారులుగా నియామకం  ఈ ప్రాంత వాసి అవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దీంతో పేద ప్రజల కష్టాలు కడ తేరా అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ మాజీ ఎంపీపీ మల్లయ్య సీనియర్  నాయకులు గంజి గోవర్ధన్ సుధాకర్ రెడ్డి  గంట సంజీవరెడ్డి,జూలకంటి సీతారాం రెడ్డి బైరు అశోక్ గౌడ్. పట్నంశెట్టి శ్రీ పాల్ రెడ్డి సట్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love