రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, రాజేశ్వరరావు తదితరులు పరామర్శించారు. ఇటీవల మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం వేల్పూర్ లోని నివాసంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, రాజేశ్వరరావు తదితరులు మంజులమ్మ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.