
మండలంలోని పిప్పిరి గ్రామానికి బుధవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు సభ ఏర్పాట్లను జిల్లా పాలనాధికారి రాజర్షి షా, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త, అదనపు ఎస్పీ తదితరులు సభా ప్రాంగణాన్ని సందర్శించి ఎటువంటి లోటులు లేకుండా చూడాలాని మండలాధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం స్వచ్ఛధనం -పచ్చదనం కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పర్యటన నిర్వహించబోతున్న సభాస్థలిని, హేలిప్యాడ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.