నవతెలంగాణ-తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గం లో శాసనసభ్యులు, అభివృద్ధి రథసారథులు గాదరి కిషోర్ కుమార్ గత తొమ్మిది సంవత్సరాలుగా అమలు చేసిన సంక్షేమ పథకాలే నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని బిఆర్ఎస్ జిల్లా నాయకులు ధూపటి రవీందర్ అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ గాదరి కిషోర్ కుమార్ శాసనసభ్యులుగా గెలిచిన 9 సంవత్సరాల లో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందించిన ఘనత ఆయనకే దక్కింది అన్నారు. మిషన్ భగీరథ తో పాటు పాలేరు జలాలతో తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మంచినీటిని అందిస్తున్నారని చెప్పారు. గతంలో సమైక్య పాలనలో తుంగతుర్తి నియోజకవర్గం లో తాగునీటి కోసం, సాగునీటి కోసం రైతులు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికార0లోకి వచ్చిన తర్వాత కాలేశ్వరం జలాలతో నియోజకవర్గంలోని చెరువులు కుంటలు నింపడంతో పాటు రైతన్నకు సాగునీరు అందించడంతో రైతులు విరివిగా పంటలు పండిస్తున్నారని ఆయన చెప్పారు. కాలేశ్వరం జలాలను తుంగతుర్తి నియోజకవర్గానికి తెప్పించిన ఘనత ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కే దక్కిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార0తో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు అందించారని చెప్పారు. గతంలో సమైక్య పాలనలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో పేదరికం పెరిగిపోయిందని చెప్పారు. నేడు వృద్ధాప్య, వికలాంగులు, వితంతు, ఒంటరి మహిళలతో పాటు అన్ని కులాల వారికి పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు. గాదరి కిషోర్ కుమార్ గెలుపు కోసం తమ యువజన సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరి మండలం తో పాటు అన్ని మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని, తుంగతుర్తి గడ్డపై మరో మరో గులాబీ జెండా ఎగరవేసి అభివృద్ధిని కొనసాగించడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.