కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

– కాంగ్రెస్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం
– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ
నవతెలంగాణ ముత్తారం : ప్రజా సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు. గురువారం ముత్తారం మండలం లక్కారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను కలుసుకొని కాంగ్రెస్ పార్టీ ఆస్తం గుర్తుపై ఓటు వేయాలని మహిళలను అభ్యర్థిస్తున్నారు. ఇండియా కూటమేనని ప్రధానిగా యువ నాయకులు రాహుల్ గాంధీకావడం ఖాయమన్నారు. ప్రజాసంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు పథకాలు ప్రతి ఒక్క నిరుపేదకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వాజిద్ ఫాష, నంద్యాల కుమారస్వామి గౌడ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love