– మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి
నవతెలంగాణ- నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగి అభివృద్ధి సాధ్యపడుతుందని కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి అన్నారు పార్వతమ్మ గూడెం గ్రామాల్లో శనివారం ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలను బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందని అన్నారు గ్రామాలలో ఎంతమందికి ఏమి అవసరాలు ఉన్నాయని గుర్తించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు దీని ద్వారా అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు ఈ ఫారాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు దీనిని ప్రతి ఒక్కరు తప్పులేకుండా కాగితాలను పూరించేందుకు గ్రామాలలో కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్లను కూడా నిర్వహిస్తుందని చేసుకొని ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన కాగితాలను పూరించి తిరిగి అధికారులకు అందజేయాలని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ప్రజల అభివృద్ధి లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజు సర్పంచ్ పరుపాటి రుక్మిణి వెంకటరెడ్డి ఎంపీటీసీ పెరుమాండ్ల గుట్టయ్య పంచాయతీ కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు.