మంత్రులు
దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఫ్యూచర్ సిటీ భవన ప్రాజెక్టు డెవలప్‌మెంట్ అథారిటీ భవనాన్ని పరిశీలన
జూన్ 2 లేదా 3న ప్రారంభోత్సవం
హాజరుకానున్న
సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును భవిష్యత్‌లో ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ రెవెన్యూ పరిధిలో ఉన్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అథారిటీ భవనాన్ని గురువారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని జూన్ 2 లేదా 3 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. తేదీపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఇక్కడ తీసుకునే ప్రతి కార్యాచరణా గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా స్పష్టమైన దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం వేస్తున్న పునాదులపై రాబోయే రోజుల్లో ఆధునిక నిర్మాణాలు వెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని, తమ ప్రభుత్వ హయాంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతోపాటు గ్లోబల్ ప్రెనవతెలంగాణ-కందుకూరుజెన్స్ కలిగిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక చట్టం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫ్యూచర్ సిటీ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో కొనసాగుతున్న యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుగుతోందని, పనుల పురోగతిని సమీక్షించి పనులను మరింత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ కె.శశాంక, మహేశ్వరం డీసీపీ కె.నారాయణ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి, టీపీసీసీ కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, సర్పంచులు విస్లావ శ్రీను నాయక్, వెంకటేష్, సురేష్, సరికొండ జగన్, కాకి నరసింహ, పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
గ్లోబల్ సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


