– ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్‌రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
గ్రామాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాం డూరు మండలం అంతారం గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి రోహిత్ రెడ్డి, సతీమణి ఆర్తిరెడ్డి, గ్రామసర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ జీవరత్నం, ఎంపీటీసీ. శాంతయ్య, నాయకులు ప్రకాష్ తదితరులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆర్తిరెడ్డి మాట్లాడుతూ.. తాండూరును మరింత అభివద్ధిలో చూడాలంటే మరోమారు గ్రామాల అభి వద్ధి కేవలం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, అభివద్ధి లక్ష్యంగా పని చేస్తున్న రోహి త్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వీ ణా శ్రీనివాస్‌చారి, గ్రామశాఖ అధ్యక్షుడు ప్రకాష్, కౌన్సిలర్ సంగీతా టాకుర్, పరిమలా, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.