అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

– ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్‌
సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే మళ్లీ తనను గెలిపిస్తాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భా గంగా సోమవారం గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని గోపన్‌పల్లి ఎన్టీఆర్‌నగర్‌, నల్ల పోచమ్మ దేవాలయంలో మాజీ కార్పొరేటర్‌ సాయిబాబా, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపన్‌పల్లి, ఎన్టీఆర్‌ నగర్‌, తాజ్‌నగర్‌ కాలనీలలో ప్రచారం నిర్వహించారు. గాంధీకి స్థానికుల నుండి అ పూర్వ మద్దతు లభించింది. మహిళలు మంగళహా రతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహ కారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో నియో జకవర్గంలో రూ. 9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని అన్నారు. మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ గణేష్‌ ముదిరాజ్‌, డివిజన్‌ ప్రెసిడెంట్‌ రాజు నాయక్‌, డివిజన్‌ మాజీ ప్రెసిడెంట్‌ చెన్నం రాజు, సత్యనారాయణ, అనిల్‌, విజరు భాస్కర్‌ రెడ్డి, విష్ణు వర్ధన్‌ రెడ్డి, రేణుక, రాజేశ్వరి, బీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love