డిప్యూటీ తహశీల్దార్ల చేతికి ధరణి రిజిస్ట్రేషన్లు..!

నవతెలంగాణ – హైదరాబాద్: భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచేలా ప్రభుత్వం కీలక సంస్కరణలు తేనున్నట్లు తెలుస్తోంది. ధరణి రిజిస్ట్రేషన్ల బాధ్యతలతో తహశీల్దార్ల సమయమంతా అక్కడే గడిచిపోతోంది. ఈ క్రమంలో ఆ బాధ్యతల్ని డిప్యూటీ తహశీల్దార్లకు ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. తహశీల్దార్లకు కార్యాలయ నిర్వహణ, భూ సమస్యల పరిష్కారం వంటి ఇతర విధులు ఇవ్వాలని భావిస్తోందట. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Spread the love