Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంఅమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ

అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రధాన్‌ భేటీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో సీజేపీ(కాక్రోచ్ జనతా పార్టీ) చేపట్టిన చలో సంసద్ యాత్రతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.ఈ నిరసనలనకు నాయకత్వం వహిస్తున్న నాయకులతో కేంద్ర మంత్రులు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతున్నారు. మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను జేపీ నడ్డా కలవనున్నారని సమాచారం.

మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ భవనం లోపల వీరి భేటీ జరిగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నీట్‌-యూజీ పేపర్ లీక్‌ ను వ్యతిరికిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చలో సంసద్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో నిరసనకారులు పార్లమెంట్‌ వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -