Sunday, July 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్75% పూర్తైనా ఏన్యుమరేషన్ ఫార్మ్స్ డిజిటలైజేషన్..

75% పూర్తైనా ఏన్యుమరేషన్ ఫార్మ్స్ డిజిటలైజేషన్..

- Advertisement -

 – సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ రెవెన్యూ  కె వెంకా రెడ్డి 
నవతెలంగాణ-ఆలేరు టౌను : ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా  75% శాతం  ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిజిటలైజేషన్ పూర్తి   చేయడం జరిగినదని, యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ కె వెంక రెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం  సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలోని  మున్సిపాలిటీలలో కాస్త తక్కువ శాతం అయిందని, మున్సిపాలిటీలలో ఉన్న బిఎల్వోలు మరికొంత సమయం వెచ్చించి డోర్ టు డోర్ తిరిగి ఓటర్ల నుండి ఫార్మ్స్ తీసుకొని వెంట వెంటనే డిజిలైజేషన్ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఓటర్లు అందరు కూడా తమ ఓటు వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్ లో నమోదు చేసి తమ తమ  బి ఎల్ ఓ లకు వెంటనే అందజేయాలని సూచించారు.  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూతు స్థాయి ఏజెంట్లు, ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు   తహసిల్దార్ వి  ఆంజనేయులు, గిర్దవర్ పూర్ణ చందర్ రావు, జీపీఓ  లు శ్రీనివాస్, స్వామి, బి ఎల్ వో లు ఫాతిమా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -