– విచారణ చేస్తున్న పోలీసులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్ధిని శుక్రవారం అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది.విధ్యార్ధిని బంధువుల రాతపూర్వక పిర్యాదు మేరకు స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ ఎస్.శ్రీను కథనం ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్ధిని, స్థానిక ఓ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. ఉదయం పాఠశాలకు వెళ్లిన కొద్ది సేపటికే కడుపులో నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.అనంతరం తన స్నేహితురాలి అన్నయ్య ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తూ మార్గమధ్యలో తన గ్రామస్తులు కలవడంతో వారితో వెళ్తానని చెప్పి దిగిపోయింది. కాగా సాయంత్రానికి కుడా ఇంటికి రాకపోవడంతో తల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.