ఊరూరా ఉపముఖ్యమంత్రి క్యాలెండర్లు…

– పంపిణీలో తలమునకలైంది కాంగ్రెస్ శ్రేణులు..

నవతెలంగాణ – అశ్వారావుపేట 
తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క – నందిని దంపతుల చిత్రాలతో ముద్రించిన 2024 సింగిల్ పేజీ క్యాలెండర్ ను కాంగ్రెస్ శ్రేణులు ఊరూరా పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం పార్టీ నియోజక వర్గం సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు నేతృత్వంలో మండలంలోని మారుమూల గ్రామాల్లో క్యాలెండర్ ను పంపిణీ చేస్తు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పధకాలను ప్రచారం చేస్తున్నారు. అనంతారం,గాండ్లగూడెం,తిరుమలకుంట ల్లో జరిగిన కార్యక్రమాల్లో మండల పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,ఎం.పి.టి.సి లు వేముల భారతి ప్రతాప్, సత్యవరుపు తిరుమల బాలగంగాధర్ లు తో పాటు స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ దాసరి నాగేంద్రరావు,లచ్చు,దుర్గారావు,మరియమ్మ,సోబన్,బన్ను లు పాల్గొన్నారు.
Spread the love