2న ‘దాహం.. దాహం..’ ఆవిష్కరణ

పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో చిన్ని నారాయణరావు రచించిన ‘దాహం.. దాహం..’ దీర్ఘకవితా సంపుటిని జులై 2న ఆదివారం సాయంత్రం 6 గంటలకు నెల్లూరు టౌన్‌ హాలు (మిద్దెపైన)లో సుప్రసిద్ధ నవలా రచయిత్రి డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి ఆవిష్కరిస్తారు. ప్రముఖ సాహితీ విమర్శకులు డా||మేడిపల్లి రవికుమార్‌, సుప్రసిద్ధ కవులు డా||సుంకర గోపాలయ్య, శ్రీరామకవచం సాగర్‌, ఏటూరి నాగేంద్రరావు, నవమల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ అతిధులుగా పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పెన్నా రచయితల సంఘం అధ్యక్షులు అవ్వారు శ్రీధర్‌ బాబు పుస్తక సమీక్ష చేస్తారు. కార్యక్రమానికి ముందు కవి సమ్మేళనం వుంటుంది.
– పెన్నా రచయితల సంఘం

Spread the love