బీఆర్ఎస్ లో అసమ్మతి..

– పుట్ట మధుకు తప్ప ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చినా అధిక మెజారిటీతో గెలిపిస్తా
– ముత్తారంలో విలేకరుల సమావేశంలో పుట్ట బాధితుల సంఘం డిమాండ్

నవతెలంగాణ-ముత్తారం: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే టికెట్ పుట్ట మధుకు ఇవ్వద్దని ఇస్తే అతనికి డిపాజిట్ కూడా రాదని పుట్ట మధు బాధితుల సంఘం ఆధ్వర్యంలో ముత్తారం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ పుట్ట మధుకు తప్ప ఎవరికి ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంథనిలో అధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు అధిష్టానాన్ని కి తెలిపారు. పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రస్తుత జెడ్పీ చైర్మన్ గా మంథని నియోజకవర్గంలో పుట్ట మధు అరాచకాలు అంతా ఇంతా కాదని నియంత పోకడతో కార్యకర్తలు నాయకులను అవమానపరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పుట్ట మధు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడని ఆ తరువాత ఆయన తన సొంత ఎజెండా మంథని నియోజక వర్గంలో అమలుపరుస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు నాయకులను పక్కన పెడుతూ అవమానాలు చేస్తున్నారని అన్నారు. ఇందుకు ఉదాహరణగా రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, మహాదేవపూర్ ఎంపీపీ రాణిబాయి రామారావు, ముత్తారం మండలంలోని మాజీ జడ్పిటిసిలు నాగినేని జగన్మోహన్రావు మైదం భారతి వరప్రసాద్ ఇలా చెప్పుకుంటూ పోతే మండల స్థాయి ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతోమంది మనోవేదన కు గురవుతున్నారని వారి బాధను అర్థం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మధుకు టికెట్ ఇవ్వకుండా మరెవరికైనా ఇవ్వాలని వారు కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పుట్ట మధు బాధితుల సంఘం నాయకులు నాగినేని జగన్మోహన్ రావు, రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, మైదం వరప్రసాద్ , కాటారం మాజీ జెడ్పిటిసి దుర్గం మల్లయ్య కాటారం మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ బండం వసంత్ రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ గుడిసె గట్టయ్య, బొల్లినేని బుచ్చం రావు, అలగం రాజేశం, సిరిమల్ల తిరుమలరావు, ఓడేడు సర్పంచ్ బక్కారావు, ఖమ్మంపల్లి మాజీ ఎంపీటీసీ బండారి సుధాకర్, ఖమ్మంపల్లి సర్పంచ్ సముద్రాల రమేష్, నియోజకవర్గంలోని 18 మంది సర్పంచులు, ఏడుగురు ఎంపీటీసీలు, ముగ్గురు మాజీ ఎంపీటీసీల తో పాటు 200 మంది నాయకులు, సర్పంచులు ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love