దత్తత గ్రామంలో సమస్యలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు..

– డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్..
– రోడ్డు నిర్మాణం కోసం కాంగ్రెస్ ఒక్కరోజు దీక్ష..
నవతెలంగాణ – రుద్రంగి
స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలు పట్టించు కోకుండా నిర్లక్ష్యం చేయడం సిగ్గు చేటు అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు.సోమవారం రుదంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్క రోజు నిరాహార దీక్ష నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి మద్దతుగా ఆది శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.గత మూడు సంవత్సరాల క్రితం మండల కేంద్రంలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు.కానీ రోడ్డుకు ఇరువైపూల డ్రైనేజీ మరియు రోడ్ వెడల్పు చేయకపోవడంతో వాహన దారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి గుంతల రోడ్డుపై నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రజల బాధను గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అనేక రకాల నిరసనలు, భిక్షటన మరియు గుంతలో వారి నాట్లు వేస్తూ, అనేక ధర్నాలు చేయడం జరిగింది ఐనా ప్రభుత్వనికి చిత్త శుద్ధి లేకపోవడంతో నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర విడి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చెప్పట్టాలి, లేనిచో ప్రతి రోజు నిరాహార దీక్షలు ఆందోళనకు సిద్దామని ప్రభుత్వంని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ ఉపాధ్యక్షులు తర్రే మనోహర్, గ్రామ శాఖ అధక్షలు మోహన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి చెలకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, తర్రే లింగం, కాంగ్రెస్ నాయకులు ఎర్రం గంగ నర్సయ్య, ఇప్ప మహేష్, ధర్నా మల్లేష్, వార్డు సభ్యులు పల్లి గంగధర్, గండి నారాయణ, పిడగు లచ్చి రెడ్డి, మాదిశెట్టి అభిలాష్, గంధం మనోజ్, సుర యాదయ్య, దువ్వక గంగాధర్, గట్ల ప్రకాష్, సనుగుల గంగాధర్, సిరికొండ రవీందర్, అట్టపల్లి మల్లేష్, పరందములు, బోండ్ల శ్రీనివాస్, ఎ రవి, అక్కెనపల్లి నర్సయ్య, శ్రీను, తప్ప గంగాధర్, రావల నర్సయ్య, ఆకుల మణి సాయి, ఎల్లల రాజారాం, ఆకుల భూమన్న, కమ్మరి లక్ష్మి నారాయణ, దేశావేణి నర్సయ్య, నేవురి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love