జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకంలో వితరణ చేసినట్టు ప్రధాన ఉపాధ్యాయుడు జంగం అశోక్ తెలిపారు. వేల్పూర్ మండలం జాన్కంపేట్ కారోబార్ పుట్టినరోజు సందర్బంగా జక్రానపల్లి మండలం తొర్లికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్, పుస్తకాలు, పెన్నులను స్థానిక, ఎంఈఓ తొర్లికొండ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ శనివారం పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎంఈవో మాట్లాడుతూ.. అన్ని దానలకన్నా విద్యధానం మిన్న అని అంటూ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉత్తములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జంగం అశోక్, జాన్కంపేట్ మాజీ ఎంపీటీసీ సత్యం రెడ్డి, వీడీసీ ప్రెసిడెంట్ వెంకన్న, కోశాధికారి లింగారెడ్డి, టీచర్ లలిత,మనోజ్, వేణు తదితరులు పాల్గొన్నారు.