Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందినబీఆర్ ఎస్ నాయకులు బాణాల పవన్ రావు గత కొన్నేల్లుగా యునైటెడ్ కింగ్డం లో  వుంటున్నారు. బుధవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన సందర్భంగా నాగార్జునసాగర్ బీఆర్ఎస్వి,బాణల పవన్ రావు ఆధ్వర్యంలో యుకేలోని ప్రెస్టన్ లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగాఎన్నారై బీఆర్ఎస్ యూకే నాయకులు బాణాల పవన్ రావు మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు  ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజా నాయుకుడు హరీష్ రావు అని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ బీఆర్ఎస్వీనాయకులు శివసాయి ,మహేందర్ ,వరుణ్ ,హారికృష్ణ, పవన్,అక్షయ్,రవి,ఉమాకాంత్,సమర సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -