ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో డుయేాల్ డెస్క్ ల పంపిణి

నవతెలంగాణ – జుక్కల్
ప్రవాస భారతీయుడు ఎనుగు దయానంద రెడ్డి జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు శుక్రవారం నాడు సమాజిక సేవలో భాగంగా యాబై డుయేాల్ డెస్క్ లు, వాలీబాల్, నెట్ ను పాఠశాల విగ్యర్థుల సౌకర్యార్థం పంపిణి చేసారని ప్రధాన ఉపాద్యాయుడు బస్వంత్ పటేల్ తెలిపారు. ఈ సంధర్భంగా ఎనుగు దయానందరెడ్డి మాట్లాడుతూ.. ప్రభూత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు ప్రయివేట్ పాఠశాలలకు సౌకర్యాలు ప్రభూత్వం కల్పిస్తోందని, తమ వంతుగా కొంత మేరకు పేద విద్యార్థులకు సహయం చేయాలనే ఉద్దేశంతో మారుముల జుక్కల్ మండలంలోని పాఠశాలలను ఎంపిక చేసి పంపిణి చేసామని పేర్కోన్నారు. కార్య క్రమంలో సహకరించిన డిసిసిబి నిజామాబాద్ సెక్రట్రి సీతయ్య, జన విఙ్ఞాన వేదిక జిల్లా అద్యక్షులు విఠల్ రెడ్డి, సాయులు, బీఆర్ ఎస్ నాయకులు, స్థానిక సర్పంచ్ రాములు, పాఠశాల చైర్మేన్, జుక్కల్ మాజీసర్పంచ్, హెచ్ ఎం బస్వంత్ పటేల్, తదితరులు పాల్గోన్నారు.

Spread the love