Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో ఏన్యూమరేషన్ ఫారాలు పంపిణీ

గ్రామాల్లో ఏన్యూమరేషన్ ఫారాలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఓటరు సవరణ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, మండల నాయకులు కలిసి మండలంలోని హెచ్ కెలూరు, పెద్ద షక్కర్గా గ్రామాలలో ఏన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల తాసిల్దార్ మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ఓటర్ సవరణ ప్రక్రియ కార్యక్రమం గ్రామ గ్రామాన పకడ్బందీగా కొనసాగుతుందని తెలిపారు. ఇంటింటికి వచ్చే బి ఎల్ ఓ లకు గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ కెలూరు సర్పంచ్ జి లక్ష్మణ్, పెద్ద షక్కర్గా సర్పంచ్ విశాలాక్షి, రాం పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మేనూర్ సర్పంచ్ అశోక్ పటేల్, పెద్ద తడగూర్ సర్పంచ్ ఈరన్న, మండల యూత్ అధ్యక్షులు హనుమంతు యాదవ్, పలువురు సర్పంచులు బిఎల్వోలు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -