వాసవి క్లబ్ ఆధ్వర్యంలో  నోట్ పుస్తకాల పంపిణీ 

– క్లబ్ అధ్యక్షుడు మానాల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – గుండాల 
గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్థానిక వాసవి క్లబ్ గ్రీన్ ఫీల్డ్స్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ 2024 సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆ క్లబ్ అధ్యక్షుడు మానాల వెంకటేశ్వర్లు నోటు పుస్తకాలు, పలకలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే 30 మంది నిరుపేద  విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలకలతో పాటు స్కూల్ డ్రెస్సులు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వాసవి క్లబ్ నిర్వహిస్తున్న సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు తవిడిశెట్టి నాగరాజు, తవిడిశెట్టి రాంబాబు, మానాల వీరన్న, మానాల శ్రావణ్, నాగ మల్లయ్య, గోలి కిరణ్, పాలడుగు భరత్, తాటికొండ వీరన్న, గౌరిశెట్టి శరన్, ఉపాధ్యాయులు నారాయణమ్మ, మంజుల, రాజ్యలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love