నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొలనుపాక పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణు గోపాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుతూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అభ్యసించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురాగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



