ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా పశు వైద్యాధికారి

నవతెలంగాణ –  భీంగల్
రైతులకు పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పసి వైద్యాధికారి  డాక్టర్ జగన్నాథ్ తెలిపారు.  జంతు సంక్షేమ వారోత్సవాలలో భాగంగా మంగళవారం పట్టణ కేంద్రంలోని  పశు సంవర్ధక  శాఖ ద్వారా  గొర్రెలకు  నీలి నాలుక నివారణ టీకాలు మరియు  కుక్కలకు రెబీస్ నివారణ టీకాలు  వేశారు. ఈ కార్యక్రమానికి  హాజరైన జిల్లా పశు  వైద్యాధికారి మాట్లాడుతూ జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా పథకాలను అందజేస్తుందని కనుక వీటిని సద్వినియోగం  చేసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమం  లో ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జెడ్పిటిసి రవి , మున్సిపల్  చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్,  ఏడిఏ డాక్టర్  భరత్ గారు మండల పశు వైద్య అధికారి డాక్టర్ కృష్ణ  సిబ్బంది నరేష్ , సంతోష్ జయరాజ్, సుమన్ , సుకేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love