
నవతెలంగాణ- మల్హర్ రావు
ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని నాచారం, అన్ సాన్ పల్లి గ్రామాల్లో ప్రజలకు ఎన్నికల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వాడుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు గురికాకూడదన్నారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి గొడవలు చేయకుండా శాంతిభద్రతలకు భంగం కలవకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఏదైనా గొడవలు జరిగినట్లయితే పోలీసులు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాటారం సిఐ రంజిత్ రావు కొయ్యూరు ఎస్సై నరేష్ , సిబ్బంది పాల్గొన్నారు.