ఇంటింటికి బీఆర్ఎస్

నవతెలంగాణ – ఐనవోలు: పెరుమాండ్ల గూడెం గ్రామంలో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వర్ధన్నపేట శాసన సభ్యులు అరూరి రమేష్ గెలుపు కోసం గ్రామంలో గడప గడపకు తిరుగుచు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల గురించి ఓటర్లకు వివరించారు. వారికి వచ్చిన సంక్షేమ పథకాలు నోట్ బుక్ లో రాసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే రమేష్ కారు గుర్తుకు ఓటు వేసి అధికం మెజార్టీ తో గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ఇంటింటా ప్రచారం చేశారు. ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు తక్కలపెళ్లి పాపారావు, బూత్ కన్వీనర్ కావటిస్వామి, నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపెళ్లి చందర్ రావు, మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు దుప్పెల్లి కొమురయ్య, గ్రామ సర్పంచ్ పిడుగు రజిత, వార్డ్ మెంబర్లు పడదెల రవీందర్రావు, జిల్లా మహేందర్, బీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు పిడుగు రవీందర్, వరంగంటి రాములు, పిడుగు యాకమల్లు, పిడుగు ఐలయ్య, పార్టీ ఉపాధ్యక్షులు పిడుగు లింగయ్య, పిడుగు అశోక్, మేకల చేరాలు,ఎస్సీ సెల్ అధ్యక్షులు కందిక రాజబాబు, కందిక రాజు, కందిక రాజశేఖర్, కందిక హరీష్, కావటి వెంకన్న, జిల్లా బాబు, జిల్లా యాకయ్య గ్రామస్తులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Spread the love