శ్వేతపత్రం విడుదల చేస్తాం… మీకు ఆ దమ్ముందా?

– బీజేపీకి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామనీ, ఆ పని చేసే దమ్ము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికుందా? అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపారు. ” విభజన హామీలు తీరుస్తారని భావించాం. ప్రధాని రాజకీయ నేతగానే వ్యవహరించా రు.తెలంగాణకు ఒక్క హామీ ఇవ్వలేక పోయారు. ములుగు గిరిజన యూనివర్సిటీ గురించి ఒక్క మాట చెప్పలేదు. బయ్యారం, ఏపీ స్టీల్‌ ఫ్యాక్టరీని ఆదానికి అప్పగించే యత్నాల్లో పర్యటించారనే అనుమానం. ప్రధానమంత్రి ఎక్కువగా చదువుకోక పోవడంతో బీజేపీ నేతల స్క్రిప్ట్‌ చదివారు. మోడీ తెలంగాణ లో అవినీతి గురించి మాట్లాడే ముందు వ్యాపం స్కామ్‌పై స్పందించాలి. మద్యం కుంభకోణంలో ఒక్క రూపాయిని కూడా కేంద్ర సంస్థలు స్వాధీనం చేసుకోలేదు. బీజేపీకి ఒక్క స్థానం కూడా రాష్ట్రంలో నిలబెట్టుకునే స్థితి లేదు. అదాని,అంబానీల కోసమే ప్రధాని పనిచేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు దేశంలో ఎవరు ఇవ్వలేదు.బీజేపీ నేతల కుట్రలతో టీఎస్పీఎస్సీలో పేపర్‌ లీక్‌ అయింది…. ” అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ ప్రధాని దిగిన మమునూరుకు ఎయిర్‌ పోర్టు డిమాండ్‌ ఉంది ప్రధాని ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. భద్రకాళి దేవాలయ అభివృద్ధికి నిధులివ్వలేదని తెలిపారు.

Spread the love