లివర్‌ సమస్య ఉందా?

లివర్‌ మన శరీరంలో ముఖ్యమైన భాగం. కాలేయం మన శరీరం నుంచి విషాన్ని, హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లివర్‌ ఫిల్టర్‌ చేస్తుంది. ఆహారం జీర్ణం చేయడానికి లివర్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆహారం జీర్ణం అయిన తర్వాత హార్మోన్‌, ఎంజైమ్‌, ప్రోటీన్‌, కొలస్ట్రాల్‌ను తిరిగి శరీరానికి అందిస్తుంది. ఇలా ఇది మన శరీరంలో 500పైగా పనులు నిర్వహిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన అవయవాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచ జనాభాలో సుమారు 38 శాతం మంది ఫ్యాటీ లివర్‌ కారణంగా ఇబ్బందిపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది లివర్‌ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. లివర్‌ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. కొన్ని సూపర్‌ ఫుడ్స్‌ సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
గ్రీన్‌ టీ..: గ్రీన్‌ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి, శరీరంలో ఆక్సిడెటవ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. గ్రీన్‌ టీలో కాటెచిన్‌ కంటెంట్‌.. లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి, శరీరంలోని వాపును తగ్గించడం ద్వారా.. లివర్‌ పని తీరును మెరుగుపరుస్తుంది. రోజూ గ్రీన్‌ టీ తాగితే.. లివర్‌ సమస్యల ముప్పు తగ్గుతుంది.
సిట్రస్‌ పండ్లు..: ద్రాక్ష, నిమ్మ, కమల, బత్తాయి వంటి సిట్రస్‌ పండ్లలో నారింగిన్‌, నరింగెనిన్‌ వంటి యాంట ీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించి.. లివర్‌ అనారోగ్యాల ముప్పు తగ్గిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
పసుపు..: పసుపులో కర్కుమిన్‌ అనే పదార్థం ఉంటుంది. కర్కుమిన్‌లో శక్తివంతమైన యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. పసుపు శరీరంలోని మంటను తగ్గిస్తుందని, లివర్‌కు హానిచేసే ముప్పులను నివారిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పసుపు శరీరాన్ని డిటాక్స్‌ చేస్తుంది. లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే డైట్‌లో పసుపు కచ్చితంగా చేర్చుకోవాలి.
క్రూసిఫరస్‌ కూరగాయలు..: క్యాబేజీ, కాలీఫ్లవర్‌, బ్రకోలీ వంటి క్రూసిఫరస్‌ కూరగాయలలో.. గ్లూకోసినోలేట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్స్‌ చేయడానికి సహాయపడే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తాయి. ఈ కూరగాయ లలోని సమ్మేళనాలు మీ శరీరంలోని టాక్సిన్స్‌, వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. క్రూసిఫరస్‌ కూరగాయలు డైట్‌లో చేర్చుకుంటే.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
బీట్‌రూట్‌..: బీట్‌రూట్‌లో నైట్రేట్లు సమద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, అథ్లెటిక్‌ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతకు మించి, బీట్‌రూట్‌లో బీటైన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని డిటాక్స్‌ చేస్తుంది. తద్వారా లివర్‌ పని తీరును మెరుగుపరుస్తాయి.
ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌..: ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె ఆరో గ్యాన్ని రక్షించడానికే కాదు.. లివర్‌ పనితీరును మెరుగుపరచడానికీ సహాయ పడతాయి. ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. మీ డైట్‌లో సాల్మన్‌, మాకరల్‌, ట్యూన్‌, అవిసె గింజలు, చియా సీడ్స్‌, అవకాడో వంటి ఆహార పదార్థాల్లో ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా లభిస్తుంది.
వాల్‌నట్స్‌..: వాల్‌నట్స్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉండే వాల్‌నట్స్‌ శరీరంలో వాపును తగ్గిస్తాయి. ఇవి లివర్‌ డిటాక్స్‌ పనితీరుకు సహాయపడతాయి.

Spread the love