బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-నవాబ్‌పేట్
మాయ మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలే యాదయ్య కోరారు. గురువారం నవాబుపేట మండలంలోని ముబారక్ పూర్ గుబ్బడి ఫతేపూర్, నారే గూడ, చించల్ పేట్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తనను మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.