బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దు..

నవతెలంగాణ-చిట్యాల : సంక్షేమ ఫలాలు సామాన్యునికి చేరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. చిట్యాల పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక కనకదుర్గ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం బి.ఎన్.రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన చిట్యాల మున్సిపాలిటీకి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పి మాట తప్పకుండా తెలంగాణ ఇచ్చిందని అన్నారు. అదే రకంగా 6 గ్యారంటీ స్కీములను స్వయంగా సోనియా గాంధీ ప్రకటించిందని వీటిని కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక అమలు చేసి తీరుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉచితంగా బియ్యం ,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని అన్నారు. టిఆర్ఎస్ మేనిఫెస్టో నీ ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని, పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని , నీళ్లు నిధులు నియామకాలు కోసమే తెలంగాణ ఏర్పడిందని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన ప్రాంతంలో పిలాయిపేల్లి ,ధర్మారెడ్డి కాల్వ పనులు ఇంకా పూర్తి చేయలేదని అన్నారు . నేను శాసనసభ్యుడుగా ఉన్నప్పుడు పెదకాపర్తి ,వెలిమినేడు గ్రామాల మధ్యన డ్రైపోర్టును మంజూరు తెస్తే తర్వాత వచ్చిన ఎమ్మెల్యే, జిల్లా మంత్రి కలిసి డ్రైపోర్ర్టు పనులను పూర్తి చేయించలేకపోయారని అన్నారు. పలువురు అధికార పార్టీకి చెందిన  కార్యకర్తలు వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల వలె పనిచేసి నకిరేకల్ శాసనసభ్యులుగా తనను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాసు, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, రేమిడాల లింగస్వామి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జడల చిన్న మల్లయ్య, ఆవుల యాదయ్య, ఎద్దులపురి కృష్ణ గుడిపాటి లక్ష్మీ నరసింహ ,జంపాల వెంక న్న ,బట్టు ఐలేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love