కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవాలని ఇంటింటికి ప్రచారం 

నవతెలంగాణ- చండూరు:
బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  గెలవాలని బీఆర్ఎస్ నాయకులు  మంగళవారం మండలంలోని శిర్దపల్లి గ్రామంలో   ఇంటింటికి ప్రచారం ముమ్మనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ సంక్షేమ  పథకాలను  గ్రామంలో  వివరించారు. పథకాలు భేష్ గా ఉన్నాయన్నారు. మునుగోడు ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజల మధ్యనే ఉన్న వ్యక్తిని  గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇడికోజు వెంకటాచారి, మండల సమితి కన్వీనర్ సిద్ధ గొని నగేష్, ఆనంద్, లక్ష్మయ్య,  బొల్లం శ్యాంసుందర్, గుంటూజు నరేష్,శివలింగం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love