హైదరాబాద్ : పలు రకాల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే జెనరిక్ ఔషధం డాక్సీసైక్లిన్ క్యాప్యూల్స్ (40ఎంజి) ని అమెరికా మార్కెట్‌లో విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వెల్లడించింది. ఈ ఔషధానికి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్‌ఎఫ్‌డిఎ) ఆమోదించిన ఒరేసియా క్యాప్యూల్స్‌కు సమానమయ్యిందని పేర్కొంది. ఒక్క ప్యాక్‌లో 30 ట్యాబ్లెట్స్ ఉంటాయని తెలిపింది.