Tuesday, July 28, 2026
E-PAPER
Homeబీజినెస్డ్రీమ్ టెక్నాలజీ డ్రీమ్‌ D30 అల్ట్రా రోబో వ్యాక్యూమ్ ఆవిష్కరణ

డ్రీమ్ టెక్నాలజీ డ్రీమ్‌ D30 అల్ట్రా రోబో వ్యాక్యూమ్ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : స్మార్ట్ హోమ్ ఆవిష్కరణలలో ప్రపంచ అగ్రగామి డ్రీమ్ టెక్నాలజీ భారత్‌లో నేడు డ్రీమ్ D30 అల్ట్రా రోబో వాక్యూమ్‌ విడుదల చేసింది. అధునాతన 25,000Pa సక్షన్, ఇంటెలిజెంట్ మాప్‌ఎక్స్‌టెండ్™ టెక్నాలజీ, ఏస్‌క్లీన్ డ్రైబోర్డ్™ వాష్‌బోర్డ్ ఆటో-క్లీనింగ్‌తో కూడిన పూర్తి ఆటోమేటెడ్ మెయింటెనెన్స్ స్టేషన్‌ను కలపడం ద్వారా డ్రీమ్ D30 అల్ట్రా నిజంగా హ్యాండ్స్-ఫ్రీ హోమ్ క్లీనింగ్‌లో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. కొత్తగా విడుదలైన ఈ ఉత్పత్తి అమెజాన్‌లో రూ.52,999లకు అందుబాటులో ఉంటుంది.  ఆగస్టు 1 నుంచి డ్రీమ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, క్రోమా, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కూడా లభిస్తుంది.

డ్రీమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను శర్మ మాట్లాడుతూ, “భారతీయ గృహాలు స్మార్ట్ లివింగ్‌ను అధికంగా అంగీకరిస్తుండటంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చురుగ్గా  సర్దుబాటు చేసుకుంటూ శ్రమ లేకుండా  శుభ్రం చేసే గృహోపకరణాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మార్పును దృష్టిలో పెట్టుకొని డ్రీమ్ D30 అల్ట్రా రూపొందించాం. ఇది శక్తిమంతమైన క్లీనింగ్ పనితీరును ఇంటెలిజెంట్ ఆటోమేషన్‌తో మిళితం చేసి వినియోగదారులు రోజువారీ పనులపై తక్కువ సమయం, అత్యంత ముఖ్యమైన వాటిపై ఎక్కువ సమయం వెచ్చించేలా చేస్తుంది. ఆధునిక గృహాలకు అనుగుణంగా రూపొందించిన ఫీచర్లతో భారతదేశవ్యాప్తంగా వినియోగదారులకు అధునాతన గృహ సంరక్షణ సాంకేతికతను మరింత అందుబాటులోకి, ఆచరణాత్మకంగా తీసుకురావాలనే డ్రీమ్ నిబద్ధతను డ్రీమ్ D30 అల్ట్రా ప్రతిబింబిస్తుంది” అన్నారు.

డ్రీమ్‌ D30 అల్ట్రా ఉత్పత్తి ముఖ్యాంశాలు

రోజువారీ ఇంటి శుభ్రత అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన డ్రీమ్ D30 అల్ట్రా వివిధ రకాల ఫ్లోర్లపై తెలివిగా మారుతూ శుభ్రం చేయడానికి కష్టమైన అంచులు, మూలలకూ చేరుతుంది. తుడుస్తున్నప్పుడు కార్పెట్లు పొడిగా ఉంచుతుంది, దుమ్ము సేకరణ, మాప్ వాషింగ్ నుంచి ఆరబెట్టడం, వాష్‌బోర్డ్ సెల్ఫ్-క్లీనింగ్ వరకు సాధారణ నిర్వహణను ఆటోమేట్ చేస్తుంది. ఇది కనీస శ్రమతో నూతన తరం గృహ శుభ్రత అనుభూతి అందిస్తుంది. ఇది తెలివైన ఆటోమేషన్‌ను శక్తిమంతమైన శుభ్రపరిచే పనితీరుతో మిళితం చేస్తుంది కాబట్టి శ్రమలేని సంపూర్ణ ఇంటి శుభ్రత  అనుభూతిని కోరుకునే వినియోగదారులకు ఇది ఒక చక్కని పరికరం.

ఇందులోని ప్రధాన ఫీచర్లు:

  • 75 రోజుల పాటు చేతులతో తాకాల్సిన అవసరం లేకుండానే దుమ్ము సేకరణ: డ్రీమ్ D30 అల్ట్రాలో 3.2లీ డస్ట్ బ్యాగ్‌తో కూడిన పూర్తిగా ఆటోమేటిక్ బేస్ స్టేషన్ ఉంటుంది. ఇది 75 రోజుల వరకు చేతులతో తాకాల్సిన అవసరం లేకుండానే దుమ్ము సేకరిస్తుంది. మాప్‌ కడగటం, ఆరబెట్టడం, నీటిని నింపడం, యాక్సెసరీల వాడకాన్ని పర్యవేక్షించడం, వినియోగ వస్తువుల రిమైండర్‌లను ఆటోమేట్ చేసి రోజువారీ నిర్వహణను గణనీయంగా తగ్గిస్తుంది.
  • శక్తిమంతమైన 25,000Pa వోర్‌మాక్స్™ సక్షన్: డ్రీమ్ అధునాతన వోర్‌మాక్స్™ సక్షన్ టెక్నాలజీతో పనిచేసే డ్రీమ్ D30 అల్ట్రా కఠినమైన నేలలు, కార్పెట్లపై దుమ్ము, చెత్త, పెంపుడు జంతువుల వెంట్రుకలు, సూక్ష్మ కణాలను సమర్థవంతంగా తొలగించడానికి 25,000Pa సక్షన్ శక్తి కలిగి ఉంది. ఐదు అడ్జస్టబుల్‌ సక్షన్ స్థాయిల ద్వారా శుభ్రపరిచే పనితీరును వినియోగదారులు తమకు తగినట్టుగా మార్చుకోవచ్చు.
  • మాప్‌ఎక్స్‌టెండ్‌™ (MopExtend™) టెక్నాలజీతో మాపింగ్‌లో సరికొత్త అనుభూతి: అంచులను తెలివైగా గుర్తించే ఫీచర్‌తో కూడిన మాప్‌ఎక్స్‌టెండ్‌™ (MopExtend™) మాప్‌ను దానంతట అదే ముందుకు చాచి, వెనక్కి తీసుకుంటుంది. ఇది అంచులు, మూలలు, 4 సెం.మీ (1.57 అంగుళాల) వరకు లోతు ఉన్న ప్రదేశాలు, స్కర్టింగ్ బోర్డులను మరింత కచ్చితత్వంతో శుభ్రం చేస్తుంది. దీనివల్ల ఫ్లోర్‌ మొత్తం పూర్తిగా శుభ్రం అవుతుంది, చేతితో చేయాల్సిన టచ్-అప్‌లు కూడా తగ్గుతాయి.
  • స్మార్ట్ కార్పెట్ క్లీనింగ్‌తో 10.5 మి.మీ ఇంటెలిజెంట్‌ మాప్ లిఫ్ట్: డ్రీమ్‌ D30 Ultra మాప్ కఠినమైన నేలలు, కార్పెట్ల మధ్య సులభంగా మారుతూ, కార్పెట్లను పొడిగా ఉంచడానికి దాని మాప్ ప్యాడ్‌లను 10.5 మి.మీ వరకు దానంతట అదే పైకి లేపుతుంది. వినియోగదారులు అనేక ఇంటెలిజెంట్‌ కార్పెట్ క్లీనింగ్ మోడ్‌ల ద్వారా కార్పెట్ సంరక్షణను మరింత అనుకూలంగా మార్చుకోవచ్చు.
  • అడ్డంకులను  కచ్చితమైన నివారించే స్మార్ట్ పాత్‌ఫైండర్™ (Smart Pathfinder™) నేవిగేషన్: స్మార్ట్ పాత్‌ఫైండర్™ (Smart Pathfinder™) నేవిగేషన్, సింగిల్-లైన్ లేజర్ అడ్డంకుల నివారణతో కూడిన డ్రీమ్ D30 అల్ట్రా ఇంటిని కచ్చితంగా మ్యాప్ చేసుకొని సమర్థవంతమైన శుభ్రపరిచే మార్గాలు సృష్టిస్తుంది.  బహుళ అంతస్తుల మ్యాపింగ్‌కు కూడా అనుకూలం. ఫర్నిచర్, ఇంట్లో ఉంటే అడ్డంకుల చుట్టూ తెలివిగా కదులుతుంది.
  • ఏస్‌క్లీన్ డ్రైబోర్డ్™ వాష్‌బోర్డ్ ఆటో-క్లీనింగ్: కచ్చితమైన 20 స్ప్రే నాజిల్‌లతో కూడిన డ్రీమ్ ఏస్‌క్లీన్ డ్రైబోర్డ్™ టెక్నాలజీతో కూడిన డ్రీమ్ D30 అల్ట్రా, వాష్‌బోర్డ్ అంతటా నీరు సమానంగా వచ్చేలా చేసి మాప్‌ వాషింగ్‌ సమర్థవంతంగా ఉండేలా చేస్తుంది. శుభ్రపరిచే పనితీరు మెరుగుపరుస్తూ, అవశేషాలు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది, నిర్వహణను సులభతరం చేస్తుంది.
  • చిక్కులు లేని శుభ్రత కోసం ట్రైకట్ బ్రష్: ఐచ్ఛిక ట్రైకట్ బ్రష్‌తో (విడిగా దొరుకుతుంది) అనుకూలంగా ఉండే డ్రీమ్ D30 అల్ట్రా వెంట్రుకలను ఆటోమేటిక్‌గా కత్తిరించి సేకరించడం ద్వారా చిక్కులు లేకుండా ఉండేలా రూపొందించబడింది. ఇది చేతితో బ్రష్‌ను శుభ్రం చేసే పనిని తగ్గిస్తుంది. పెంపుడు జంతువులు, పొడవాటి జుట్టు ఉన్నవాళ్ల ఇళ్లకు ఇది చాలా అనువైనది.
  • పెంపుడు జంతువులకు అనుకూలమైన శుభ్రతతో స్మార్ట్ యాప్ నియంత్రణ: డ్రీమ్‌హోమ్ యాప్ ద్వారా వినియోగదారులు బహుళ అంతస్తుల మ్యాపింగ్, రూమ్‌ జోనింగ్, శుభ్రపరిచే షెడ్యూల్స్‌, వర్చువల్ సరిహద్దులు, అనుకూలమైన శుభ్రపరిచే పద్ధతులు, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకమైన శుభ్రపరిచే విధానాన్ని వ్యూహాలు యాక్సెస్ చేయవచ్చు. ఇవి మరింత సమర్థవంతమైన శుభ్రత కోసం పెంపుడు జంతువులు తిరిగే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి లేదా వాటిని నివారించడానికి వారికి వీలు కల్పిస్తాయి.
  • 30% వేగవంతమైన ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీ: అధిక సామర్థ్యం గల 5200mAh బ్యాటరీతో పనిచేసే డ్రీమ్ D30 అల్ట్రా, 30% వేగవంతమైన ఛార్జింగ్‌తో పనికి అంతరాయం కలిగే సమయాన్ని తగ్గిస్తూ ఎక్కువసేపు శుభ్రపరిచే పనితీరుకు తోడ్పడుతుంది. అందువల్ల ఇది పెద్ద ఇళ్లు, బహుళ గదులు శుభ్రపరచడానికి అనువైనది

డ్రీమ్ D30 అల్ట్రా ఒక సంవత్సరం వారంటీతో పాటు భారతదేశవ్యాప్తంగా 160కి పైగా నగరాల్లో విస్తరించి ఉన్న డ్రీమ్ ఆఫ్టర్‌-సేల్స్‌ సర్వీస్‌  నెట్‌వర్క్ కలిగి ఉంది. వినియోగదారులు ప్రత్యేక మద్దతు సేవలు పొందడం సహ ఎంపిక చేసిన ప్రదేశాలలో పికప్, డ్రాప్ సాయం, ఇన్‌స్టాలేషన్ సహకారం పొందవచ్చు.

D30 అల్ట్రా ఆవిష్కరణతో భారతదేశంలో తన ప్రీమియం స్మార్ట్ హోమ్ పోర్ట్‌ఫోలియోను డ్రీమ్ మరింత బలోపేతం చేసుకుంటూ రోజువారీ జీవితాన్ని సులభతరం, ఇంటిని శుభ్రపరిచే అనుభూతి మెరుగుపరచడానికి అత్యాధునిక ఆవిష్కరణ, సహజమైన డిజైన్‌ను మిళితం చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -