ఎమ్మెల్యే చుట్టం చూపుగా వస్తున్నాడు-దుబ్బాక నరసింహ రెడ్డి

నవతెలంగాణ – చిట్యాల 
చిట్యాల మండలం నేరడ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, గ్రామ సర్పంచ్ దుబ్బాక మమత – వెంకట్ రెడ్డి, దుబ్బాక అమరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని శనివారం నాడు నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని మెదటగా గ్రామంలో కంఠమహేశ్వర స్వామి వారిని దర్శించుకుని, అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, స్వర్గీయ దుబ్బాక సతీష్ రెడ్డి విగ్రహాం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలోరాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి మాట్లాడుతూ  బీఆర్ఎస్ ఎమ్మెల్యే చుట్టం చూపుగా వస్తున్నాడే తప్ప చేసేది ఏమి లేదని తెలిపారు. వీరేశం చేరిక తో టి రెండిత బలం చేకూరిందని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పై త్రీవమైన వ్యతిరేకంగా ఉందని, ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వీరేశం  గెలువబోతున్నారని తెలిపారు. ఇదే ఉత్సాహంతోటి మనం కష్టాపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.వేముల వీరేశం మాట్లాడుతూ దుబ్బాక నర్సింహారెడ్డి  ఆశీస్సులతో ఈ గ్రామంలో ప్రచారం కి విచ్చేసిన సందర్భంలో ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ మండలంలోనే నేరడ గ్రామం అత్యధికంగా మైజారిటి ఇవ్వండి గెలిచాక ఈ మెదటగా అభివృద్ధి పనులకు ఈ గ్రామంలో నే కొబ్బరికాయ  కొడుతానన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు, యువకులు, అందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ,ఈ గ్రామంలో 95% ఓట్లు కాంగ్రెస్ పార్టీ కి వేసి గెలిపించండీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. నవంబర్ 30 నాడు చేయి గుర్తుకు ఓటు వేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో దుబ్బాక రజనీకాంత్ రెడ్డి, మిర్యాల నరేష్, ఉపసర్పంచ్ వడ్డెగోని నరసింహ, కాటం వెంకటేశం, గుడిపాటి లక్ష్మీనరసింహ, తాళ్ల వెల్లంల సర్పంచ్ జనగాం రవీందర్, బట్టు ఐలేష్, ఆవుల యాదయ్య, ఏర్పుల పరమేష్, బెల్లి సైదులు, కౌన్సిలర్ రెమిడాల లింగస్వామి, శిర్రబోయిన కృష్ణయ్య, దుబ్బాక నవీన్ రెడ్డి, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు
Spread the love