
నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా దామరచర్ల మండలానికి చెందిన దుర్గంపూడి నారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు డీసీఎంఎస్ జిల్లా మేనేజర్ మురళి నుండి ఆయన గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నితమకానికి సహకరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు లకు కృతజ్ఞతలు తెలిపారు. బ్యాక్ అభివృద్ధి కి కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు కె.వీరకోటి రెడ్డి తోపాటు పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాక్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.