– యండి. సలీం, డివైఎఫ్ఐ భువనగిరి పట్టణ కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం అర్బన్ కాలనిలోని పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి సంబంధించి నిర్మాణం ఆగిపోయిన భవనంను డివైఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటి ఆద్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగ భువనగిరి పట్టణ కార్యదర్శి యండి. సలీం మాట్లాడుతూ.. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణంను పూర్తిచేసి పూర్తి స్థాయిలో వైద్యసేవలు ప్రారంభించాలని కోరారు. చాలా మంది వృధ్ధులు పెద్ద ఆసుపత్రికి పోలేక ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. భవన నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభిస్తే వారందరికి ఉపయోగంగ ఉంటుందని తెలిపారు. ఇ కార్యక్రమంలో పట్టణ ఉపధ్యక్షులు రియాజ్, సాజిద్, మణికంట, సోహేల్ పాల్గొన్నారు.