విద్య, వైద్యం,ఇరిగేషన్, ఇండస్ట్రీస్ లు నా మొదటి ప్రాధాన్యత:ఎమ్మెల్యే వంశీకృష్ణ

నవతెలంగాణ – ఉప్పునుంతల
అచ్చంపేట ఏరియా హాస్పిటల్  సర్జికల్ క్యాంప్ లో భాగంగా శనివారం జరిగే ఉప్పునుంతల, వంగూరు ,చారకొండ మండలాల చెందిన వారికి టుబెట్టమి ఆపరేషన్ లకు సంబంధించిన ఏర్పాట్లను. ఉప్పునుంతల మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద స్థానిక వైద్యాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. మెగా సర్జికల్ క్యాంపులో నమోదు చేసుకున్న వారందరికి కూడా వివిధ మండలాలకు కేటాయించిన సమయంలో అక్కడే సర్జికల్ ఆపరేషన్లో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించగలరు. అచ్చంపేట నియోజకవర్గంలో విద్యా వైద్యం ఉపాధి వ్యవసాయం పరిశ్రమలలో మొదట ప్రాధాన్యతగా తీసుకొని అభివృద్ధి చేయడమే నా లక్షమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love