ముదిరాజ్ యువ సేన నూతన కమిటి ఎన్నిక

నవతెలంగాణ -వీర్నపల్లి
వీర్నపల్లి మండల కేంద్రంలో గురువారము ముదిరాజ్ యువసేన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యువసేన అధ్యక్షులుగా తౌటు అజయ్, ఉపాధ్యక్షులుగా పీట్ల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా మండపల్లి రవి సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తౌటు అజయ్ ముదిరాజ్ ఐక్యతను బలోపేతం చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తాను ఈ ఎన్నికకు సహకరించి నాపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్ల ప్రవీణ్,తౌటు పవన్,పిట్ల కాజిబాబు,స్వామి, సాయి రామ్, రామచంద్రం, గోవర్ధన్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love