నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రానికి చెందిన పైడిపల్లి లింగన్న అనే రైతు రాజురా శివారులోని వ్యవసాయ క్షేత్రం నుంచి 33/11 కేవీ విద్యుత్ స్తంభాల లైన్ వెళ్లింది. ఈ క్రమంలో తన పొలంలోని విద్యుత్ స్థంభాలను తొలగించాలని ఇటీవలే విద్యుత్ శాఖ ఏఈకి వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన విద్యుత్ శాఖ డిఈ తిలక్, ఏఈ ఆదిత్య రైతులతో కలిసి శనివారం వ్యవసాయ పంట క్షేత్రల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. తర్వాత రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయ క్షేత్రానికి పక్కన ఉన్న ఓడ్డుపై స్తంభాలను తీసుకువెళ్లాలని అధికారులను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించి, ఈ పనులను రేపటి నుంచే ప్రారంభించి త్వరలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ మారుతీ పైడిపెల్లి గంగాధర్ రైతులు తదితరులు ఉన్నారు.
వ్యవసాయ లైన్లను పరిశీలించిన విద్యుత్ శాఖ అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



