నవతెలంగాణ – పెద్దవంగర
కార్యకర్తల కుటుంబాలకు అందుబాటులో ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, చిట్యాల బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పోతుగంటి ప్రవీణ్ లను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని చెప్పారు. ఆయన వెంట పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, ఉప సర్పంచ్ మొర్రిగాడుదుల శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య, ఉషయ్య, సుభాష్, తొర్రూరు ఎంపీపీ తూర్పాటి అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.