నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సాఫ్ట్‌వేర్, సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న ఎస్రీ ఇండియా ఒక మిలియన్ వినియోగదారులను చేరుకున్నట్లు ఎస్రీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్ర కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా విభిన్న పరిశ్రమలలో విస్తరించి ఉన్న విస్తృత కస్టమర్ బేస్ విశ్వాసం, విధేయతకు నిదర్శనమన్నారు. జియోస్పేషియల్ డేటా గైడ్‌లైన్స్ 2021 నుంచి.. ఎస్రీ ఇండియా భారతీయ సంస్థగా ఇప్పుడు ఆర్క్‌జీఐఎస్ లివింగ్ అట్లాస్ ఇండియన్ ఎడిషన్ ద్వారా 900 పైగా జియోస్పేషియల్ డేటాను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ డేటా లేయర్‌లు ఇండో ఆర్క్‌జీఐఎస్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఇండో ఆర్క్‌జీఐఎస్ వివిధ సవాళ్లను పరిష్కరించడానికి 200 పైగా పరిష్కార ఉత్పత్తులను కూడా అందిస్తుందన్నారు. ఈ మైలురాయిని సాధించడంలో సహాయపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు తమ రంగాలలో శ్రేష్టత సాధించేందుకు జియోస్పేషియల్ టెక్నాలజీల సామర్థ్యాన్ని విస్తృతంగా యూజ్ చేస్తున్నాయనడానికి ఈ వినియోగదారుల బేస్ ఒక నిదర్శనమన్నారు. 2021, 2022లో భారత ప్రభుత్వం ప్రకటించిన అనుకూల విధానాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. జియోస్పేషియల్ కమ్యూనిటీతో నిరంతరం పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీఐఎస్ వర్క్‌ఫ్లోల ద్వారా తమ పనిలో సమయం, వ్యయ ఆప్టిమైజేషన్ సాధించడంలో సహాయపడనున్నట్లు పేర్కొన్నారు. ఈ పొదుపు భారతదేశ ఆర్థిక వృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇది ఎంతగానో దోహదం చేయనుందన్నారు. ఎస్రీ ఇండియా కేంద్ర ప్రభుత్వ అటవీ, నీటి వనరుల శాఖలతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, రెండు వందలకు పైగా మున్సిపల్ కార్పొరేషన్లు, స్మార్ట్ సిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థలను లెక్కిస్తుందన్నారు. జాతీయ మ్యాపింగ్ ఏజెన్సీలు, ప్రముఖ తయారీ, టెలికమ్యూనికేషన్ కంపెనీలు, యుటిలిటీలు, ఎనిమిది వందలకు పైగా డిగ్రీ గ్రాంటింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మొత్తం 6,500 పైగా సంస్థలను కలిగి ఉన్నామన్నారు. భవిష్యత్తులో కంపెనీ తన కస్టమర్ బేస్‌కు అనేక విశ్వసనీయ పేర్లను జోడించడానికి సిద్ధంగా ఉందన్నారు. వినియోగదారులకు జీఐఎస్ పరిష్కారాలు అందించడానికి ప్రైవేట్, ప్రభుత్వ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎస్రీ తన వార్షిక ఆదాయంలో 30 శాతం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో మళ్లీ పెట్టుబడి పెడుతుందని తెలిపారు.