కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు..

– నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. 
– బారి కెడ్లు,  పోలీస్ బందోబస్తు..
నవతెలంగాణ-అచ్చంపేట : లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడిన అప్పటినుంచి. అన్ని శాఖల అధికారులు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూలు  మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గం వర్గాలలో 18 నుంచి 25 వరకు అభ్యర్థుల నుండి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు స్వరవం సిద్ధం చేశారు. కలెక్టర్ కార్యాలయంలోనే రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేయడంతో ప్రధాన గేటు ముందు బారికేడ్లు, పోలీస్ భద్రత వ్యవస్థ పటిష్టం చేస్తారు.
ఎన్నికల అధికారి చాంబర్ నుంచి 100 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు భారీ పోలీస్ బందోబస్తు మూడంచెల పోలీసు వ్యవస్థ మధ్యలో నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కలెక్టరేట్ ఉద్యోగులు కచ్చితంగా తమ ఐడెంటి కార్డులను చూపిస్తూ విధులకు హాజరు  కావలసి ఉంటుంది. సందర్శకులకు మధ్యాహ్నం 3
 గంటల వరకు ఎలాంటి అవకాశం ఉండదు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి అల్లర్లు , గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తారు.
అభ్యర్థుల ర్యాలీలను , వాహనాలను 100
మీటర్ల లోపే నిలుపుదల చేస్తారు. అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే లోనికి ప్రవేశం ఉంటుంది. ప్రతి అంశాన్ని వీడియో, ఫోటో తియడం జరుగుతుంది.
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గద్వాల, వనపర్తి, అలంపూర్, కొల్లాపూర్ నాగర్ కర్నూల్ , కల్వకుర్తి , అచ్చంపేట  నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 14 లక్షల 77, 300 ఓటర్లు ఉన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వుడు కు కేటాయించారు. ఎంపీ అభ్యర్థులు రూ .12500 /-రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది.
అభ్యర్థులు నూతనంగా బ్యాంకులో అకౌంట్ తీసిన పాస్ పుస్తకం కచ్చితంగా వెంటనే తీసుకురావాల్సి ఉంటుంది. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు వివరాలు ఎన్నికల అధికారికి వెల్లడించాలి.
ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది.
వీరే అభ్యర్థులు 
నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులుగా రాజకీయ పార్టీలు ఇంతకుముందే ప్రకటించాయి. భారత రాష్ట్ర సమితి నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ మల్లురవి, భారతీయ జనతా పార్టీ నుండి భరత్ ప్రసాద్ పోటీ చేయనున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసే పరిస్థితులు ఉన్నాయి.
నామినేషన్ల షెడ్యూలు.
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం 18వ తేది గురువారం.
నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ 25. వ తేది గురువారం.
నామినేషన్ల పరిశీలన 26 వ తేది శుక్రవారం.
నామినేషన్ల ఉపసంహరణ 29వ తేదీ సోమవారం.
పోలింగ్ తేదీ మే 13.
Spread the love