మొదలైన అసెంబ్లీ ఆట.?

– ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో వేడెక్కిన రాజకీయం
– ప్రచారాలకు రేడివుతున్న పార్టీలు
– మంథని నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు 23,591
నవతెలంగాణ- మల్హర్ రావు
అసెంబ్లీ ఎన్నికలకు సైరన్ మోగింది.ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల ప్రవార్తన నియమావళి అమల్లోకి వచ్చి,ఎన్నికల వేడి మొదలై మంథని నియోజకవర్గంలో అసెంబ్లీ ఆట మొదలైంది.ఇక నుంచి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమావేశాలు జరపరాదు.ఆన్ గోయింగ్ స్కీoలను కొనసాగించవచ్చు.ఎన్నికల తంతూ అధికారికంగా ప్రారంభం కావడంతో పల్లెల్లో, పట్టణాల్లో ప్రచార పర్వం మొదలు కానుంది.ఇప్పటికే అధికారపార్టీ తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించింది.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిపేస్టో 6 గ్యారంటీలను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.నవంబర్ 3న నోటిఫికేషన్, 10న నామినేషన్లు,13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మంథనిలో పెరిగిన ఓట్లు..23,591
మంథని నియోజకవర్గంలో మొత్తం 2014లో 2,10,232, ఓటర్లు ఉన్నారని, 2018లో 2,06,715 ఓటర్లు ఉన్నారని, తాజాగా 2,30,306 ఓట్లు ఉన్నాయని గణానంకాలు చెబుతున్నాయి.2018 సంవత్సరానికి ప్రస్తుతానికి మంథని నియోజకవర్గంలో 9 మండలాల్లో 23,591 ఓట్లు పెరిగారు. వీరిలో యువత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీల వారిని లక్ష్యంగా చేసుకొని మేనిపేస్టో ప్రచారానికి రూపకల్పన చేస్తున్నాయి.
ఇవి చేయడానికి వీల్లేదు..
కోడ్ అమల్లోకి వచ్చినందున మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక పర్యటనలు చేయరాదు. ప్రభుత్వ పథకాలు,ప్రచారాల పోస్టర్లు,ప్లెక్సీలు తొలగిస్తారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజు నుంచే ప్రతి అభ్యర్థి ఖర్చుపై నిఘా ఉంటుంది. కొత్త పథకాల ప్రకటన, మౌలిక సదుపాయల కల్పనపై ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.అధికారిక వాహనాల వినియోగంపై పరిమితులు ఉంటాయి.నగదు రవాణా విషయంలో బంగారం, వడ్డీ, బ్యాoకింగ్ అధికారులతోపాటు సామాన్యులు,రైతులు అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికీ కావాల్సిన ఇన్వాయిస్ బిల్లులు దగ్గర పెట్టుకోవాలి. లైసెన్స్ ఆయుదాలన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలి.దేవాలయాల, ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎలాంటి కానుకలు,డబ్బులు,మద్యం, పంచకూడదు. రాజకీయ విమర్శలు చేసే క్రమంలో వర్గాన్ని,నాయకుడిని ఉద్దేశిస్తూ .విద్వేష వ్యాఖ్యలు చేయకూడదు. ర్యాలీలు, సభల విషయంలో అధికారుల అనుమతులు తీసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి.

Spread the love