- దళిత బహుజన రాజ్యాధికార సమక్య రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుడిపల్లి రవి
నవతెలంగాణ-వనపర్తి: మా వాడలో మా రాజ్యం లక్ష్య సాధనలో భాగంగా ఇండియా విప్లవ రథ సారధి, కులవర్గ పోరాటాల సిద్దాంత కర్త, మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాత, అస్థిత్వ ఉధ్యమాల సృష్టికర్త కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతిని పురస్కరించుకోని.. అంబేద్కర్ చౌరస్తాలో సిపియుఎస్ఐ (డిబిఎస్ వి) ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి) వనపర్తి జిల్లా కమిటీ ఆద్వర్యంలో మారోజు వీరన్ప చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందద్భంగా దళిత బహుజన రాజ్యాధికార సమాక్య రాష్ట్ర కన్వీనర్ డా. గుడిపల్లిరవి మాట్లాడుతూ 1999 మే16న మారోజు వీరన్నను నరహంతక చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పట్టుకుపోయి కరీంనగర్ గట్ల నర్సింగాపూర్లో బూటకపు ఎన్ కౌంటర్ చేయడం చేశారని చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు దాటి పోతున్నా, రాజ్యాంగం అమలు అయ్యి 76 సంవత్సరాలు గడిచిపోతున్నా, రాష్ట్రంలో దేశంలో మెంబర్, సర్పంచి కాని కులాలు, అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగు పెట్టని కులాలు ఉన్నాయంటే ఈ దేశంలో స్వతంత్రం, అధికారం ఎవరికొచ్చినదో దళిత బహుజనలు అర్థం చేసుకోవాలని వాపోయారు. ఈ దేశంలో సబ్బండ కులాలకు న్యాయం జరగాలంటే మా వాడలో మా రాజ్యం రావాలని తెలిపారు. మా వాడలో మా రాజ్యం అంటే ఉమ్మడి గ్రామ పంచాయతీలను, ఉమ్మడి నియోజకవర్గాలను రద్దు చేసి కుల ప్రతి పధికన అధికారం కల్పించాలని డిమాండ్ చేశారు. 300 జనాభా ఉన్న ప్రతి కులం వాడను గ్రామ పంచాయతీగా, 50వేల నుండి 1లక్ష జనాభా ఉన్న ప్రతి కులాని ఎమ్మెల్యే నియోజకవర్గంగా, 1 లక్ష జనాభా నుండి 2లక్షల జనాభా ఉన్న ప్రతి కులాని ఎంపీ నియోజకవర్గంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆడవాళ్ళకు 50 శాతం రిజర్వేషన్, కుల ప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాని ఇప్పటి వరకు 26 మంది మొగ ముఖ్యమంత్రులు పాలించారని, ఒక్క ఆడముఖ్యమంత్రి కూడా కాకపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డపెట్టని తెలిపారు. తెలంగాణ మూడో ముఖ్యమంత్రి దళిత బహుజన ఆడవాళ్లు కావాలని డిమాండ్ చేశారు.
కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతి ముగింపు సభతో పాటు, 14 5మంది అమర వీరల సంస్మరణ సభను ములుగు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగినది, ఆ సభకు వనపర్తి జిల్లా దళిత బహుజన పీడిత ప్రజానికం పెద్ద ఎత్తున కదిలి రావాలని, ఆర్థికంగా, హర్థికంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపియుఎస్ఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మిద్దెరాములు, ఆడజన రాజ్యాధికార సమాక్య వనపర్తి జిల్లా కన్వీనర్ బి. జ్యోతక్క, ఆడజన రాజ్యాధికార సమాక్య నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ సల్వాది జ్యోతక్క, మహనీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజావాగ్గేయ కారుడు రాజారాం ప్రకాష్, బుడుగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గగనం మంతప్ప, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు M.A ఖాదర్ పాషా, జిల్లా మైనార్టీ నాయకుడు బాలేమియా, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుడు గంధం కృష్ణయ్య, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుడు రతన్ నాయక్, ఈశ్వరమ్మ మొదలగు నాయకుల పాల్గొని నివాళి అర్పించారు.



