Monday, July 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళల పాత్ర ఉండే ప్రతీ ఉద్యమం జయప్రదం

మహిళల పాత్ర ఉండే ప్రతీ ఉద్యమం జయప్రదం

- Advertisement -

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
మహబూబ్‌ నగర్‌ నుంచి నవతెలంగాణ ప్రతినిధి

చరిత్రలో మహిళల పాత్ర ఉండే ప్రతి ఉద్యమం జయప్రదమైందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి చెప్పారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలో సోమవారం ఆమె మాట్లాడారు. వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో మహిళల పాత్ర పెరగాలని ఆకాంక్షించారు. ఆ రంగంలో 80 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. ఉపాధిహామీ చట్టంలో కూడా ఎక్కువగా పని చేస్తున్నది మహిళలేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి వ్యవసాయ కార్మికులు వెన్నెముకలాంటి వారన్నారు. ఆర్థిక సామాజిక పోరాటాల్లో మహిళలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా ల విధానాల ఫలితంగా నిత్యావసర సరుకుల ధరలురోజురోజుకు పెరిగిపోతున్నాయనీ, దాని ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -