రైతు ఆశీర్వాద సభగా నామకరణం
నవతెలంగాణ-చింతకాని
ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని పలు ప్రాంతాలను సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్, జిల్లా సీపీ సునీల్ దత్‌తో కలిసి పరిశీలించారు. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఈనెల 26న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి విక్రమార్క.. సభా ప్రాంగణాన్ని అధికారంగా ‘రైతు ఆశీర్వాద సభ’గా నామకరణం చేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముకైనా రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. రైతుల కష్టానికి గౌరవం తెలుపుతూ వారి ఆశీర్వాదాలతోనే రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని తెలిపారు. అందుకే ఈ సభకు రైతు ఆశీర్వాద సభ అని పేరును ఖరారు చేసినట్టు తెలిపారు. రైతు రుణమాఫీ, పెట్టుబడి సహాయం, సాగునీటి సదుపాయాల కల్పన వంటి పలు కార్యక్రమాలు రైతుల అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఈనెల 26న నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వేలాదిగా రైతులు, వ్యవసాయ కూలీలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రైతుల ఆశీస్సులతో తెలంగాణ మరింత సస్యశ్యామలంగా కావాలనే సంకల్పంతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రైతు ఆశీర్వాదమే
తెలంగాణ అభివృద్ధికి నిజమైన బలం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, సుడా చైర్మెన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్, అంబటి వెంకటేశ్వర్లు, కూరపాటి కిషోర్, కిలారు మనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జగన్నాధపురంలో సీఎం సభా ప్రాంగణాన్ని..పరిశీలించిన డిప్యూటీ సీఎం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



