జ్యోతక్క గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

– మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు

– కేసీఆర్ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడె నాగజ్యోతి
– మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెల్లడి
నవతెలంగాణ-తాడ్వాయి : ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ జెడ్పీ చైర్మన్ తాడ్వాయి మండల ఇన్చార్జి సాంబారు సమ్మారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల, బూత్ కమిటీ అధ్యక్షుల, మండల ప్రజా ప్రతినిధుల, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మారావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి గడపగడపకు తిరిగి బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో వివరించాలని సూచించారు. 100 ఓట్లకు ఓ ఇన్చార్జి, ఆ ఇన్చార్జి ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు. బడే నాగజ్యోతిని ఆశీర్వదిస్తే ఇప్పటివరకు పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒకవైపు, రాబోయే ఐదేళ్లలో జరిగే అభివృద్ధి ఒకవైపు ఉంటుందని చెప్పారు. ప్రజలు, ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలకు ఆగం కావద్దని, అభివృద్ధిలో భాగం కావాలని సూచించారు.‌ ఓవైపు కాంగ్రెస్, బిజెపి తీరును ఎండగడుతూనే.. మరోవైపు స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అసలు సిసలైన బిఆర్ఎస్ బిడ్డ, ప్రజల కొరకు ప్రాణాలర్పించిన బడే ప్రభాకర్ అన్న బిడ్డ ను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తే అభివృద్ధి అంటే ఏంటిదో చూపిస్తానని తెలిపారు. టిఆర్ఎస్ పాలనలో రైతాంగం సంతోషంగా ఉండదని సంక్షేమ పథకాల అమలులో నిరుపేదలను నిశ్చితంగా బతుకుతున్నారు. బండ వర్గాల కోసం మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని అన్నారు. కాలనాగు లాంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది ? పంట పెట్టుబడి రైతుబంధు ఇచ్చిందా..? మడులు తడిచేలా నిరంధించిందా..? మరణించిన రైతు కుటుంబాలకు రైతు బీమా ఇచ్చిందా..? ప్రజలు ఆలోచించాలి, కానీ అభివృద్ధి చేసేది అన్ని వర్గాలకు మేలు చేసేది బిఆర్ఎస్ సర్కారే అని అన్నారు. కెసిఆర్ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు.  రాబోయే ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఈసారి ఎన్నికల్లో ప్రజల కోసం ప్రాణాలర్పించిన బడే ప్రభాకర్ అన్న కూతురైన, పేదింటి బిడ్డనైనా నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దండుగల మల్లయ్య, ఎంపీపీ గొంది వాణిశ్రీ, మాజీ జెడ్పిటిసి రామసాయం శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, కోఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, మాజీ మండలాధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, నూశెట్టి రమేష్, బండారు చంద్రయ్య, ఉపసర్పంచ్ ఇంద్రారెడ్డి, ఎంపీటీసీ కుక్కల శ్రీను, సర్పంచులు పుల్లూరు గౌరమ్మ, గొంది శ్రీధర్, గుర్రం రమా సమ్మిరెడ్డి, ఊకే మోహన్ రావు, నాయకులు పైడిపల్లి అశోక్, సిద్ధబోయిన శివరాజు,  పాయం నర్సింగరావు, శివన్న, బంగారు సాంబయ్య, మండలంలోని 18 గ్రామ పంచాయతీల గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు బూత్ కమిటీ అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love