– ఎస్‌ఐ వెంకట్ నారాయణ
నవ తెలంగాణ-యాచారం
వాహనదారులందరూ రోడ్డు భద్రత నిబంధ నలు పాటించాలని ఎస్‌ఐ వెంకట్ నారాయణ అన్నారు. మంగళవారం యాచారం కేంద్రంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనా దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటేనే రోడ్డుపై నడపాలని సూచించారు. చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. ఎవరైనా రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.