
మండలంలోని రాజుర గ్రామంలో పచ్చదనం- స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. అనంతరం ఐకేపీ సంఘ భవనం, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలో ఐకేపీ మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయులు రేగుంట రాజేశ్వర్ మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలే ఆధారం అని ప్రతి ఒక్కరూ బాద్యతయుతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ మహిళ అధ్యక్షురాలు సరస్వతి, సిఎ లు మధురాణి, దివ్య, అన్నపూర్ణ హెచ్ఐఓ రవీందర్, హెచ్ఎస్ నరేష్, ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి ,మురళీ మనోహర్ రెడ్డి విజయ్ కుమార్, చంద్ర శేఖర్, అర్చన, శంకర్ సింగ్, రవి, విద్యార్థులు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు లలిత ,పద్మ, శోభ, ఏఎన్ఎం గోదావరి, ఆశా కార్యకర్తలు సవిత, శ్రీలత ,మమత పాల్గొన్నారు.